Your Ad Here

Friday, February 5, 2010

స్టేట్ బ్యాంకులో "రాసలీలలు" రియల్ స్టొరీ




ప్రభుత్వ రుణాల కోసం వస్తున్న గిరిజన మహిళలను లోబర్చుకుని కామవాంచ తీర్చుకుంటున్న ఓ ఫీల్డ్‌ ఆఫీసర్‌ బాగోతం అనంతపురం జిల్లాలో వెలుగుచూసింది. రాసలీలను మళ్లీ మళ్లీచూసుకునేందుకు సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తూ కంప్యూటర్స్‌లో భద్రపరుచుకుంటున్నాడీ ప్రబుద్దుడు. తోటి ఉద్యోగులు వీటిని సీడిల రూపంలో విక్రయించడంతో ఫీల్డ్‌ ఆఫీసర్‌ బండారం బయటపడింది.

అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతం. ఈ మండల పరిధిలో సుమారు 15 గిరిజన తండాలున్నాయి. ఇక్కడ ఉన్నది ఒకే ఒక్క స్టేట్ బ్యాంక్. తాండా వాసులకు, ఇతరులకు ఈ బ్యాంక్ ద్వారానే రుణాలు మంజూరు చేస్తారు. ఇందులో పని చేసే ఫీల్డ్ ఆఫీసర్ నామాల ప్రభాకర్‌కు అమ్మాయిల పిచ్చి. రుణాలిస్తానని చెప్పి మహిళలను లొంగదీసుకుంటాడు.

అప్పు కోసం వచ్చే అమాయక గిరిజన యువతులను నయానో, భయానో బెదిరించి లోబరుచుంటాడు. అంతటితో ఆగక శృంగార కార్యకలాపాల్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తున్నాడు. ఆ తర్వాత కంప్యూటర్‌లో భద్రపరుచుకుని మూడ్‌ వచ్చినపుడు బ్లూ ఫిల్మ్‌లు చూసినట్లు చూసి ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన బ్యాంక్‌ ఉద్యోగుల్లో ఎవరో ఒకరు వీటిని సిడిల రూపంలో విక్రయించి క్యాష్‌ చేసుకున్నారు.

బహిరంగ మార్కెట్‌లో వంద రూపాయలకో సిడి లభిస్తుండటంతో వజ్రకరూర్‌ ఏరియాలో ఎక్కడా చూసినా ఫీల్డ్‌ ఆఫీసర్‌ నామాల ప్రభాకర్‌ శృంగార సీడీలే దర్శనమిస్తున్నాయి. విషయం తెలిసిన మహిళా సంఘాలు అగ్గిమీద గుగ్గిల మయ్యాయి. పీల్డ్‌ ఆఫీసర్‌పై చర్యలకు మహిళా సంఘాలు, ఎస్సీ, ఎస్టీ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

అమాయక గిరిజన మహిళలను లోబరుచుకున్న నామాల ప్రభాకర్‌పై అట్రాసిటీ కేసులు నమోదు చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాయి.ఫీల్డ్‌ ఆఫీసర్‌ వికృత చేష్టలపై బ్యాంక్‌ మేనేజర్‌ను సంప్రదించగా సదరు అఫీసర్‌ను ఉన్నతాధికారులకు సరెండర్‌ చేశామని చేతులు దులుపుకున్నారు.

ఇదే విషయమై పోలీసుల వివరణ కోరగా సిడిలు లభ్యమైతే చర్యలు తీసుకుంటామని తాపీగా చెబుతున్నారు.అమాయక గిరిజన మహిళలను లొంగదీసుకున్న ఎస్‌బిఐ ఫీల్డ్‌ అఫీసర్‌ నామాల ప్రభాకర్‌పై స్థానిక అధికారలు చర్య తీసుకోకుంటే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని ఎస్టీ సంఘాలు హెచ్చరిస్తున్నాయి

No comments:

Post a Comment

Do you believe Lawrence Taylor is innocent of the rape charge?

 
Disclaimer:
This site does not store any files on its server.We only index and link to content provided by other sites and also if you feel any copyrighted material is seen in this blog
please feel to write us....kkusuma1984@yahoo.com
eXTReMe Tracker